కిశోర్​ కేక..4 వికెట్లతో మెరిసిన సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌

కిశోర్​ కేక..4 వికెట్లతో మెరిసిన సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌
  •     రాణించిన తెవాటియా, గిల్
  •     పంజాబ్‌‌‌‌పై గుజరాత్ గెలుపు

ముల్లాన్‌‌‌‌పూర్‌ ‌‌‌‌‌‌‌:  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌తో గత మ్యాచ్‌‌‌‌లో 89 రన్స్‌‌‌‌కే కుప్పకూలి ఓడిన గుజరాత్ టైటాన్స్‌‌‌‌ వెంటనే పుంజుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్పిన్నర్ సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌ (4/33) సత్తా చాటడంతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌లో జీటీ  మూడు  వికెట్ల తేడాతో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ను ఓడించింది. బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌లో నిరాశ పరిచిన పంజాబ్‌‌‌‌ వరుసగా నాలుగో ఓటమితో డీలా పడింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.  ప్రభ్‌‌‌‌సిమ్రన్ సింగ్ (21 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ (12 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 29) టాప్ స్కోరర్లు.

సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌ నాలుగు, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్‌‌‌‌ రెండేసి వికెట్లు తీశారు. ప్రభ్‌‌‌‌సిమ్రన్,  సామ్ కరన్ (19 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లతో 20)  తొలి వికెట్‌‌‌‌కు 52 రన్స్ జోడించి మంచి ఆరంభమే ఇచ్చినా.. మిడిలార్డర్ కుప్పకూలడంతో పంజాబ్ చిన్న స్కోరుకే పరిమితం అయింది. ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ను మోహిత్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో పంజాబ్ వికెట్ల పతనం మొదలైంది. రిలీ రొసో (9) నిరాశ పరిచాడు. తను నూర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్ బౌలింగ్‌‌‌‌లో ఎల్బీ అవగా..   కరన్‌‌‌‌ను రషీద్‌‌‌‌ను పెవిలియన్ చేర్చాడు. ఆపై, సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌‌‌‌కు క్యూకట్టారు. జితేశ్ శర్మ (13), శశాంక్ సింగ్ (8), అషుతోశ్‌‌‌‌ శర్మ (3)ను కిశోర్‌‌‌‌‌‌‌‌ ఔట్ చేయగా..

లివింగ్‌‌‌‌స్టోన్ (6)ను నూర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌ వెనక్కుపంపాడు. చివర్లో హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్‌‌‌‌ (14)తో కలిసి  హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ ఎనిమిదో వికెట్‌‌‌‌కు 40 రన్స్ జోడించడంతో పంజాబ్ అమాత్రం స్కోరైనా చేసింది. తర్వాత గుజరాత్ 19.1 ఓవర్లలో 146/7   స్కోరు చేసి గెలిచింది. రాహుల్ తెవాటియా ( 18 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లతో 36 నాటౌట్‌‌‌‌), కెప్టెన్ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్ (29 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 35) రాణించారు. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో టైటాన్స్‌‌‌‌ తడబడి నిలబడింది. ఓపెన్ వృద్ధిమాన్ సాహా (13) నాలుగో ఓవర్లో ఔటవగా. కెప్టెన్ గిల్, ఇంపాక్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సాయి సుదర్శన్‌‌‌‌ (31) రెండో వికెట్‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌ జోడించారు.

కానీ, గిల్‌‌‌‌తో పాటు డేవిడ్ మిల్లర్‌‌‌‌‌‌‌‌ (4)ను వరుస ఓవర్లలో ఔట్‌‌‌‌ చేసిన లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ జీటీకి షాకిచ్చాడు. సుదర్శన్‌‌‌‌ను కరన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయగా, అజ్మతుల్లా ఓమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌ (13) ఫెయిలవడంతో 103/5తో జీటీ ఇబ్బందుల్లో పడింది. కానీ, షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (8)తో కలిసి రాహుల్ తెవాటియా జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. బ్రార్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. రబాడ వేసిన 18వ ఓవర్లో అతను మూడు ఫోర్లు కొట్టగా, షారూక్ సిక్స్‌‌‌‌ బాది 20 రన్స్‌‌‌‌ రాబట్టడంతో జీటీ విజయం ఖాయమైంది. హర్షల్ పటేల్ మూడు, లివింగ్‌‌‌‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు

పంజాబ్‌ ‌‌‌: 20 ఓవర్లలో 142 ఆలౌట్‌‌‌‌ (ప్రభ్‌‌‌‌సిమ్రన్ 35, హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ 29, సాయి కిశోర్ 4/33)
గుజరాత్ :  19.1 ఓవర్లలో 146/7 (తెవాటియా 36*, గిల్ 35, హర్షల్ 3/15, లివింగ్‌‌‌‌స్టోన్ 2/19)