బాలీవుడ్‌లోకి రౌడీ బేబీ?

బాలీవుడ్‌లోకి రౌడీ బేబీ?

నలుగురూ నడిచే దారిలో నడవడానికి ఇష్టపడరు కొందరు. తమ దారిని తామే వేసుకుంటారు. ఆరు నూరైనా అందులోనే సాగుతారు. సాయి పల్లవి కూడా ఇదే టైప్. గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రలు చేయదు. మేకప్‌‌‌‌ ఇష్టపడదు. తాను బ్యూటీ ప్రొడక్ట్స్‌‌‌‌ వాడదు కాబట్టి యాడ్స్‌‌‌‌లో యాక్ట్ చేయడానికి ఇష్టపడదు. నచ్చితే ఏ పాత్రైనా చేస్తుంది. నచ్చకపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా కాదంటుంది. అందుకే ఆమెను అందరూ ద బెస్ట్ అంటుంటారు. పల్లవి అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటాయో ఆమె చేసే పాత్రలు కూడా అంతే స్ట్రాంగ్‌‌‌‌గా ఉంటాయి. వాటిలో ఆమె నటన ప్రతిసారీ సూపర్బ్ అనిపించుకుంటూ ఉంటుంది. అందువల్లే ఆమెని దృష్టిలో పెట్టుకుని మరీ పాత్రల్ని రూపొందిస్తున్నారు దర్శకులు. దానికి తోడు ఆమె మంచి డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రౌడీ బేబీ, సారంగ దరియా పాటలతో పాత రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది పల్లవి. అందుకే ఇప్పుడామెను బాలీవుడ్ ఆఫర్స్ కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. నిజానికి ‘ఫలానా సినిమాలో అవకాశం వచ్చింది’, ‘ఈ సినిమాలో నటించబోతోంది’ అంటూ చాలా హిందీ మూవీస్ విషయంలో సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ అవన్నీ పుకార్లేనని తర్వాత తేలింది. అయితే ఆమె బీటౌన్‌‌‌‌లో అడుగుపెట్టడం మాత్రం ఖాయమంటున్నారు ఇండస్ట్రీవారు. ఆల్రెడీ ఓ ప్రముఖ బ్యానర్‌‌‌‌‌‌‌‌ పల్లవిని కాంటాక్ట్ చేసిందట. కథ, పాత్ర నచ్చడంతో ఆమె ఓకే అందని కూడా చెబుతున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ కూడా రాబోతోందట. ఆల్రెడీ రకుల్, రష్మిక బాలీవుడ్‌‌‌‌లో పాగా వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు సాయిపల్లవి కూడా వెళ్తోంది. అయితే గ్లామర్‌‌‌‌‌‌‌‌ పాత్రలకు పూర్తి దూరంగా ఉండే పల్లవికి అక్కడ ఎలాంటి ఆఫర్స్‌‌‌‌ వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమాల విషయానికొస్తే నాగచైతన్యతో నటించిన ‘లవ్ స్టోరీ’, రానాతో కలిసి యాక్ట్ చేసిన ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నానితో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలో నటిస్తోంది. తమిళంలోనూ కొన్ని ప్రాజెక్టులకు కమిటయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బీటౌన్‌‌‌‌లో ఎప్పటికి అడుగుపెడుతుందో చూడాలి!