క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ

క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ

సెలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత పెంచుకుంటోంది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా మరో ఆఫర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు జంటగా కనిపించనుందనే టాక్ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినిపిస్తోంది. విజయ్ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ  మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సాయి పల్లవిని ఫిక్స్ చేశారట. ఆమెను దృష్టిలో పెట్టుకునే హీరోయిన్  క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశాడట దర్శకుడు. అలాగే  ఈ చిత్రంలో తన పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో  సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఈ  కొత్త కాంబో ప్రేక్షకులను ఏవిధంగా అలరించనుందో చూడాలి. ప్రస్తుతం సాయి పల్లవి  ‘తండేల్’ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిజీగా ఉంది.

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఓ తమిళ చిత్రం, హిందీ ‘రామాయణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో సాయి పల్లవి నటిస్తోంది.