సాయిపల్లవి క్రేజీ చాన్స్​ కొట్టేసింది

సాయిపల్లవి క్రేజీ చాన్స్​ కొట్టేసింది

హీరోయిన్ సాయిపల్లవి సక్సెస్‌‌, ఫెయిల్యూర్స్‌‌ పట్టించుకోకుండా తన మనసుకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. కిందటేడాది ఆమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు విడుదలయ్యాయి. అప్లాజ్ వచ్చిన స్థాయిలో కమర్షియల్‌‌ సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం శివకార్తికేయన్‌‌కు జంటగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. మరో తమిళ చిత్రంలో ఆమె నటించబోతుందని, అదికూడా అజిత్‌‌కు జంటగా కనిపించనుందని టాక్. ‘తెగింపు’ చిత్రంతో సంక్రాంతికి వచ్చిన అజిత్, త్వరలో విఘ్నేష్‌‌ శివన్‌‌ డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేయనున్నాడు. అనిరుధ్‌‌ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

ఇందులో హీరోయిన్‌‌గా ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించాయి. అయితే సాయిపల్లవిని ఫైనల్‌‌ చేశారనేది లేటెస్ట్ అప్‌‌డేట్. స్టార్ హీరో సినిమాలైనా సరే.. స్టోరీతో పాటు తన క్యారెక్టర్‌‌‌‌ నచ్చితేనే ఓకే చెబుతుంది సాయిపల్లవి. అందుకే ఆమధ్య ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లి పాత్రకు నో చెప్పింది. అయితే దర్శకుడు విఘ్నేష్ శివన్‌‌ సినిమాల్లో హీరోయిన్‌‌ క్యారెక్టర్స్‌‌కు కచ్చితంగా ఇంపార్టెన్స్‌‌ ఉంటుంది కనుక ఆ సినిమాలో ఆమె నటించడం దాదాపు కన్‌‌ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఓకే అయితే ఆమె కెరీర్‌‌‌‌కు కూడా ప్లస్ అవుతుంది. ఫిబ్రవరి నుండి ఈ మూవీ షూటింగ్ మొదలవనుంది. గుజరాత్, ముంబైలలో షూటింగ్ చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది.