
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపించనుంది. దక్షిణాది సినిమాలో స్టార్డం చూస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌ను ఊపేయనుంది. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదట. మనీశ్ తివారి తెరకెక్కించనున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో కనిపించనుందని టాక్.
ఈ హీరోయిన్ సీతగా నటించనుందని ఎప్పటినుంచో వార్తుల వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ ఈ సినిమా నుంచి సైడ్ అయ్యిందని తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించనున్న ఈ సినిమాలో ఆలియాకు బదులు సాయి పల్లవి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో మరోసారి బీటౌన్‌లో ప్రేమమ్ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఈ నటి స్పందించాల్సి ఉంది.