
హైదరాబాద్, వెలుగు: ఇండియా సీనియర్ షట్లర్ బి. సాయి ప్రణీత్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు. అనిల్ కుమార్ మామిడాలతో కలిసి ‘వాట్స్ ఇన్ ద గేమ్’ పేరిట సరికొత్త స్పోర్ట్స్ మీడియా, టెక్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు.
శనివారం జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో కలిసి దీన్ని ప్రారంభించారు. వెబ్ 3.0, మెటావర్స్ స్పోర్ట్స్ అప్లికేషన్ అయిన ‘వాట్సా ఇన్ ద గేమ్’లో 60 అంతకంటే తక్కువ పదాలతోనే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లు, షెడ్యూల్, రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయని ప్రణీత్, అనిల్ చెప్పారు.