
ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో దూసుకెళ్తున్నారు. ఈ ముగ్గురితో పాటు సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ కు చేరు కోగా, పారు పల్లికశ్యప్ , హెచ్ ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో నాలుగో సీడ్ పీవీ సింధు 21–13,21–19తో ప్రపంచ 22వ ర్యాంకర్, డానిష్ ప్లేయర్ మియా బ్లిచ్ ఫెల్ట్‌ను వరుస గేముల్లో చిత్తుగా ఓడించి టోర్నీలో ముందంజ వేసింది. కేవలం 39 నిమిషాల్లో ఈ మ్యాచ్ ను ముగించిన సింధు.. మియాపై వరుసగా రెండో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో ఆరోసీడ్ సైనా నెహ్వాల్ 21–16, 18–21, 21–19తో పొర్న్‌పవీ చొచువాంగ్ (థాయ్ లాండ్ ) పై మూడు గేమ్ ల పాటు చెమటోడ్చి విజయం సాధించింది. తొలి గేమ్ ఈజీగానే నెగ్గిన సైనా రెండో గేమ్ లో అనూహ్యం గా తడబడింది. అయితే, హోరాహోరీగా సాగిన మూడోగేమ్ లో తన అనుభవాన్ని రంగరించి ఆడి చొచువాంగ్ ను ఓడించింది. తద్వారా మలేసియా ఓపెన్‌తొలి రౌండ్ లో ఆమె చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
క్వార్టర్ స్ లో చైనాకు చెందినకై యన్యన్ తో సింధు, రెండో సీడ్ నజోమి ఒకుహరా(జపాన్ )తో సైనా తలపడనున్నారు . పురుషుల ప్రిక్వార్టర్ స్ లో శ్రీకాంత్ 21–12, 23–21తో హన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్ క్ )పై చెమటోడ్చి గెలిచాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న యువ షట్లర్ సమీర్ వర్మ 21–15, 21–18తో లు గువాంగ్జు (చైనా)పై గెలిచి క్వార్టర్స్ చేరాడు. కానీ, కశ్యప్ 9–21, 21–15,16–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 11–21, 11–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్ )తో చేతిలోపరాజయం పాలయ్యాడు. కార్టర్స్ లో మొమోటాతో శ్రీకాంత్ , రెండో సీడ్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)తో సమీర్ తలపడనున్నాడు. ఇక, మిక్స్‌డ్ డబుల్స్ లో ప్రణవ్ జెర్రీ చోప్రా-–-సిక్కిరెడ్ డి జోడీ 21–17, 6–21,21–19తో ఐదో సీడ్ టాం గ్ చున్ మన్ సెయిం గ్ సుయెట్ (హాం కాంగ్ ) జంటపై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరగా.. మహిళల డబుల్స్ లో పూజాదండు-సంజనా సంతోష్ ద్వయం 15–21, 12–21తో నమి మత్సుయమాచి హరు షిడా (జపాన్ )జోడీ చేతిలో పరాజయం పాలైంది.