బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టేందుకు సిద్ధం: సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టేందుకు సిద్ధం: సైనా నెహ్వాల్

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. హిమాచల్ ప్రదేశ్ లో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు  సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఉత్తరాది నుంచి చాలా మంది క్రీడాకారులు బ్యాడ్మింటన్ లో ట్రైనింగ్ కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్తుంటారని తెలిపింది.  అలాంటి వారికోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్తరాదిన అకాడమీని ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది సైనా.