సైనా, శ్రీకాంత్​ ఒలింపిక్​  ఆశలు గల్లంతు!

సైనా, శ్రీకాంత్​ ఒలింపిక్​  ఆశలు గల్లంతు!

మలేసియా ఓపెన్​ పోస్ట్​పోన్​

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్​పై భారీ ఆశలు పెట్టుకున్న ఇండియా స్టార్​ షట్లర్లు సైనా నెహ్వాల్​, కిడాంబి శ్రీకాంత్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్​ క్వాలిఫయింగ్​ ఈవెంట్​ అయిన మలేసియా ఓపెన్​ సూపర్​–750 టోర్నీని పోస్ట్​ పోన్​ చేశారు. మలేసియాలో కరోనా కేసులు పెరగడంతో.. బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​ (బీడబ్ల్యూఎఫ్​) వాయిదా నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్​ ప్రకారం ఈ టోర్నీ ఈ నెల 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్​లో జరగాల్సి ఉంది.  వీలైనంత త్వరగా రీషెడ్యూల్​ డేట్స్​ను ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్​ చెబుతున్నా.. ఒలింపిక్​  క్వాలిఫయింగ్​ విండోలో మాత్రం టోర్నీని నిర్వహించడం సాధ్యమయ్యేలా లేదు. బీడబ్ల్యూఎఫ్​ నిర్ణయంతో సైనా, శ్రీకాంత్​ ఒలింపిక్​ ఆశలకు భారీ గండి పడింది. కాగా, మలేసియా ఓపెన్​ పోస్ట్​పోన్​ కావడంతో.. టోక్యో ఒలింపిక్​ క్వాలిఫికేషన్​కు సంబంధించిన క్లారిటీ ఇవ్వాలని బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (బాయ్​)..  బీడబ్ల్యూఎఫ్​ని కోరింది. ‘కీలక క్వాలిఫయర్​ పోస్ట్​పోన్​కావడం నిజంగా దురదృష్టకరమే. సైనా, శ్రీకాంత్​తో పాటు మరికొందరు  టోక్యో రేస్​లో ఉన్నారు. అందుకే షట్లర్ల  క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్​ సెక్రటరీ థామస్​ లుండ్​ను కోరాం’ అని బాయ్​ పేర్కొంది.