నవంబర్ 21న రాంగ్ యూసేజ్ సాంగ్ విడుదల

నవంబర్ 21న రాంగ్ యూసేజ్ సాంగ్ విడుదల

వచ్చే సంక్రాంతికి ‘సైంధవ్‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వెంకటేష్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. గత నెలలో టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. దీపావళి సందర్భంగా కొత్త అప్‌‌డేట్ ఇచ్చారు. ఈనెల 21న ‘రాంగ్ యూసేజ్‌‌’ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో డ్యాన్సర్స్‌‌తో కలిసి మాస్‌‌ డ్యాన్స్‌‌ చేస్తున్నట్టు కనిపించారు వెంకటేష్. సంతోష్ నారాయణన్ ఈ ఎనర్జిటిక్ సాంగ్‌‌ను కంపోజ్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాష్‌‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 13న ఐదు భాషల్లో విడుదల కానుంది.