ఫైనల్ మిషన్.. గెట్ రెడీ విక్టరీ ఫ్యాన్స్

ఫైనల్ మిషన్.. గెట్ రెడీ విక్టరీ ఫ్యాన్స్

హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh)  ప్రస్తుతం తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ 75వ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ మూవీకు 'సైంధవ్' (Saindhav) అనే విభిన్న టైటిల్ ప్రకటించడంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ మూవీ కోసం శైలేష్ కొలను(Sailesh Kolanu)  అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్లో కథను రెడీ చేసినట్లు సమాచారం..కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ 'సైంధవ్' ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ అమాంతం పెంచేసింది.  

ప్రస్తుతం 'సైంధవ్' మూవీ కీలక షెడ్యూల్స్ను ఫినిష్ చేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా మూవీటీమ్ సోషల్ మీడియా లో షేర్ చేయడంతో వెంకీ  ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్,  రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న టీమ్ .. మరో కీలక షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవ్వబోతుందంటూ ప్రకటించారు మేకర్స్. 
 
హిట్ సిరీస్లో కేవలం మర్డర్లు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లతో ఆసక్తి రేపిన  శైలేష్ కొలను..  ఈసారి తన యాక్షన్ టేకింగ్లో అసలు టాలెంట్ను 'సైంధవ్' మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ( Nawazuddin Siddiqui)  విలన్‌గా నటిస్తున్నారు.

డిసెంబరు 22న విడుదల కానున్నా ఈ మూవీకి సంతోష్‌ నారాయణ్(Santhosh Narayanan)  సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్(NiharikaEnt) బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి(Venkat boyanapalli) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

https://twitter.com/KolanuSailesh/status/1674025896355962880/video/1