యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సౌగాని ఎన్నిక

యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సౌగాని ఎన్నిక

కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీలోని వివేకానంద విద్యానికేతన్ స్కూల్​లో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ట్రస్మా స్టేట్ చీఫ్​సౌగాని కొమురయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్​లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా యాదవులు ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని పిలుపునిచ్చారు. 

ఇందుకోసం ఈనెల 24న మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలోని అరవింద ఫామ్ హౌస్ లో యాదవులకు ప్రత్యేక రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తరగతులను యాదవ కుల బాంధవులు వినియోగించుకోవాలని సూచించారు. సభలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణయాదవ్, ఏటీ యాదవ్, పలుమారు మల్లేశంయాదవ్, రాజేందర్ యాదవ్, దాడి సంపత్ కుమార్ యాదవ్, ఓదెలు యాదవ్, పద్మ యాదవ్ పాల్గొన్నారు.