చంద్రబాబు, రామోజీ రావులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు, రామోజీ రావులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు, రామోజీ రావు ఎంత నీచమైన మనుషులో నిరూపితమైందని  ఎపి ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  2023, అక్టోబర్ 18వ తేదీ బుధవారం తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  సజ్జల మాట్లాడుతూ..  సిఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు.  రామోజీ ఎదుగుదలకు కారణమైన జిజే రెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలని... జిజేరెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారని అయన అన్నారు. 

మార్గదర్శి షేర్ హోల్డర్ ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారని..  చంద్రబాబు, రామోజీ రావు తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారని దుయ్యబట్టారు.  చంద్రబాబు అరెస్టు విషయంలో టిడిపి నేతల తీరు వింతగా ఉందన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు అని..  చంద్రబాబు కేసులో ప్రజల దృష్టి మళ్లించే ప్రయంత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. పక్కా ఆధారాలతో దొరికినా కూడా డ్రామాలు చేస్తున్నారని సజ్జల  మండిపడ్డారు.