గుంటూరు బేబీని మింగేసిన..సలార్ సూరీడు

గుంటూరు బేబీని మింగేసిన..సలార్ సూరీడు

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వస్తోన్న చిత్రం గుంటూరు కారం. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ (Oh My Baby) ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి..ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి..నా చున్నీ నీకు టై కట్టాలి..సాంగ్ రిలీజయింది. ఈ సాంగ్ రిలీజైన 20 గంటల్లో 2.6M  వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ పాట లవ్ ఆడియన్స్ కు నచ్చేలా కనిపిస్తోంది.

అలాగే హీరో ప్రభాస్ (Prabhas)..ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన  ‘సలార్’ (Salaar)ఫస్ట్ సింగిల్ (Sooreede Song) సూర్యుడే గొడుగు పట్టి..వచ్చాడే భుజము తట్టి..చిమ్మచీకటి నీడలోన ఉండేటోడు..అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజైన 20 గంటల్లో 4.8M వ్యూస్ దక్కించుకుని రికార్డుల మోతకు పరుగులు తీస్తోంది.

ఈ రెండు పెద్ద సినిమాల నుంచి సాంగ్స్ గంట వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి.కానీ, ప్రభాస్ సలార్ సూరీడు సాంగ్..గుంటూరు బేబీ సాంగ్ని మింగేసింది. ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు మహేష్ సాంగ్స్ రావడంతో ఫ్యాన్స్ ఖుషి అయినప్పటికీ..ఇప్పుడు పోటీగా మారింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది.

గుంటూరు కారం నుంచి వచ్చిన లవ్ మెలోడికి..సలార్ నుంచి వచ్చిన స్నేహానికి..దేనికదే ఎక్కువ అని..ఇందు పోలిక ఈ మాత్రం తగదని సినీ విశ్లేషకులు ఆడియాన్స్ కు నచ్చచెబుతున్నారు. సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..మేకర్స్ ప్రమోషన్స్‌ పనుల్లో వేగం పెంచారు. 

ఇక గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా 12 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ (Harika hasini creations) పై చినబాబు (Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

  • Beta
Beta feature
  • Beta
Beta feature