పన్నులకు పాత పద్ధతే .. గత ఆర్థిక సంవత్సరం మాదిరే స్లాబ్స్​               

పన్నులకు పాత పద్ధతే .. గత ఆర్థిక సంవత్సరం మాదిరే స్లాబ్స్​               
  • వేతన జీవులను నిరాశపర్చిన బడ్జెట్​

న్యూఢిల్లీ: బడ్జెట్​ రోజు శాలరీడ్​ క్లాస్ ఆశగా ఎదురుచూసేది ఆదాయపు పన్ను రాయితీ కోసమే! ఈసారి వారికి నిరాశే ఎదురయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2024లో కొత్త,  పాత ఆదాయపు పన్ను విధానాలకు పన్ను స్లాబ్ రేట్లను యథాతథంగా ఉంచారు. అంటే గత ఆర్థిక సంవత్సరం పన్ను విధానమే ఈసారి కూడా వర్తిస్తుంది.

కొత్త విధానంలో రూ.ఏడు లక్షల వరకు పన్ను ఉండదు. కార్పొరేట్ ​పన్నులను, కస్టమ్స్​ సుంకాలను కూడా మార్చలేదు. పన్నులకు సంబంధించి ఎటువంటి మార్పులనూ ప్రతిపాదించడం లేదని,  దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష పన్నులకు,  పరోక్ష పన్నులకు గత పన్ను రేట్లే కొనసాగుతాయని తెలిపారు.  మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబులు  రేట్లతో సంబంధం లేకుండా ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయం అర్థం చేసుకోదగ్గదేనని, గ్లోబల్ మార్కెట్లలో సమస్యలు కొనసాగుతున్నందున, వృద్ధిని పెంపొందించడానికి ఇలా చేసి ఉండవచ్చని అక్యూబ్ వెంచర్స్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ అన్నారు.

అయితే, ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు,  మాంద్యం కారణంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కొంత ఉపశమనాన్ని ఆశించారు. "ముఖ్యంగా జీతం పొందే వాళ్లు చాలా రకాలుగా ఇబ్బందిపడుతున్నారు. జీతాలు పెరగడం లేదు. ఉద్యోగ మార్కెట్లో ఆటుపోట్లు ఉన్నాయి. ఖర్చులు చాలా పెరిగాయి. అధిక స్టాండర్డ్ డిడక్షన్, మెరుగైన హౌసింగ్ లోన్ వడ్డీ మినహాయింపులు లేదా 80సీలో మార్పులు వీరికి కొంత ఊరటను ఇచ్చేవి. ఇవేవీ లేవు కాబట్టి  కొంత నిరాశ సహజమే’’ అని ఆశిష్ అగర్వాల్ అన్నారు.

కొత్త  పన్ను విధానం

1. రూ. 3 లక్షల వరకు ఆదాయానికి పన్ను ఉండదు
2. రూ.3–-6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను విధిస్తారు. సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ  ఉంది
3. రూ.6–-9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తారు. రూ.7 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ ఉంది
4. రూ.9–-12 లక్షల మధ్య ఆదాయం ఉంటే -15 శాతం పన్ను చెల్లించాలి.
5. రూ.12-–15 లక్షల మధ్య ఆదాయం గల వాళ్లు 20 శాతం పన్ను భరించాలి.
6. రూ.15 లక్షలు  అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధిస్తారు. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు అన్ని వర్గాల వ్యక్తులకు, అంటే వ్యక్తులు, సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  సూపర్ సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఒకే విధంగా ఉంటాయి.

పాత పన్ను విధానం

1. రూ.2.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
2. రూ.2.5 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉంటే పాత పన్ను విధానంలో 5 శాతం చొప్పున పన్ను విధిస్తారు.
3.  రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయంపై 20 శాతం పన్ను విధిస్తారు.
4. రూ.10 లక్షలకు పైబడిన వ్యక్తిగత ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తారు.
పాత పన్ను విధానంలో, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి 60 ఏళ్లు పైబడిన 80 ఏళ్లలోపు ఉన్న వయసున్న సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అయితే 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఈసారి పన్నుభారాన్ని కొంతైనా తగ్గిస్తారని మధ్యతరతగతి జనం భావించింది కానీ ప్రభుత్వం మాత్రం రేట్లను ఎప్పట్లాగే ఉంచింది.