"వెలుగు" ఎఫెక్ట్... కాంట్రాక్టు లెక్చరర్లకు శాలరీలు రిలీజ్

"వెలుగు" ఎఫెక్ట్... కాంట్రాక్టు లెక్చరర్లకు శాలరీలు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఎట్టకేలకు జీతాలు రిలీజ్ అయ్యాయి. 2 నెలల జీతాలు విడుదల చేస్తూ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల11న ‘కాంట్రాక్టు లెక్చరర్లకు 4 నెలలుగా జీతాల్లేవ్’ హెడ్డింగ్​తో ‘వెలుగు పత్రిక’లో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలివ్వాలని ఇంటర్ బోర్డు సెక్రటరీని ఆదేశించింది. దీంతో జూన్, జులైకుగాను 3,554 మందికి రూ.38.53 కోట్లు విడుదలయ్యాయి. దీనిపై కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేశ్​ హర్షం వ్యక్తం చేశారు.