ఎంపీల జీతం 1.24 లక్షలకు పెంపు

ఎంపీల జీతం 1.24 లక్షలకు పెంపు
  • అలవెన్స్​లు, మాజీ సభ్యుల పెన్షన్లు కూడా
  • 2023 ఏప్రిల్​ 1 నుంచే అమలులోకి.. కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: పార్లమెంట్​ సభ్యుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. సభ్యులకు నెలనెలా అందించే శాలరీల్లో  24 శాతం హైక్​ ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో ఎంపీ నెలకు రూ. లక్ష వేతనం అందుకుం టున్నారు. దీనిని తాజాగా రూ. లక్షా 24 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డెయిలీ అలవెన్సు రూ. 2 వేలు ఉండగా.. దాన్ని రూ.2,500కు పెంచింది. ఇక, మాజీ ఎంపీలకు ప్రస్తుతం రూ. 25 వేలు పెన్షన్​ ఇస్తుండగా.. దాన్ని రూ. 31వే లకు చేర్చింది. 

అదనపు పింఛన్​లోనూ కేంద్రం మార్పులు చేసింది. ప్రస్తుతం రూ. 2 వేలుగా ఉన్న అడిషనల్ పెన్షన్​ను రూ.2,500కు పెంచింది. ఇన్​ఫ్లేషన్​ ఇండెక్స్​ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్​ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ పెంపు 2023 ఏప్రిల్​ 1 నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది.