సెక్టార్ల ఉద్యోగులకు శాలరీ పెరుగుతుంది

సెక్టార్ల ఉద్యోగులకు శాలరీ పెరుగుతుంది

వెల్లడించిన ఏఓఎన్​పీఎల్​సీ  సర్వే

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో చాలా సెక్టార్ల ఉద్యోగులకు 10.6 శాతం వరకు శాలరీ పెరుగుతుందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది.  అత్యధికంగా జీతాల పెరుగుదల ఉండే  ఐదు రంగాలలో నాలుగు టెక్నాలజీకి సంబంధించినవేనని పేర్కొంది! మార్కెట్లలో ఒడిదుడుకులు, గ్లోబల్​గా ఆర్థిక మాంద్యం వంటి సమస్యలను ఇవి ఎదుర్కొంటున్నాయని  ఏఓఎన్​పీఎల్​సీ నిర్వహించిన సర్వే తెలిపింది. దీని ప్రకారం.. 2022లో ఇప్పటి వరకు 10.6శాతం వార్షిక పెరుగుదల ఉండగా, 2023లో భారతదేశంలో జీతాలు 10.4శాతం పెరుగుతాయని అంచనా. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఇండియాలోని 40 రంగాలకు చెందిన 1,300 కంపెనీల డేటాను పరిశీలించి ఈ రిపోర్టును తయారు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా జర్మనీ (3.5%), యూకే (4%), అమెరికా (4.5%), చైనా (6%) బ్రెజిల్ (5.6%),  జపాన్ (3%)  దేశాలతో పోలిస్తే 2022లో ఇప్పటి వరకు అత్యధిక జీతాలు పెరిగిన ఏకైక దేశం ఇండియానే కావడం విశేషం.  10.6శాతం వరకు ఇంక్రిమెంటు మరే దేశంలోనూ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే కరోనాకు మనదేశంలో జీతాల పెంపు సింగిల్​ డిజిట్​ను మించలేదు. 2019లో ఇది 9.3% కాగా, 2020లో 6.1% 2021లో 9.3% జీతాలు పెరిగాయి.