ప్రైవేటు బాటలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ప్రైవేటు బాటలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు
  • 4 ఎయిర్ పోర్టుల్లో ప్రభుత్వ వాటాల అమ్మకం
  • ప్యాకేజీలుగా మార్చి విక్రయం

న్యూఢిల్లీ:ఇప్పటికే చాలా ఎయిర్ పోర్టులను ప్రైవేట్ కు అప్పగించిన ప్రభుత్వం, వీటిలో మరిన్ని వాటాలను అమ్మడానికి రెడీ అవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో మిగిలిన వాటాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించనుంది. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.2.5 లక్షల కోట్లను సేకరించడంలో భాగంగా వీటిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులతోపాటు మరో 13 విమానాశ్రాయాల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఉన్న వాటాలను గత నెల జరిగిన సెక్రెటరీల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.  నాలుగు ఎయిర్ పోర్టుల్లో ఏఏఐ జాయింట్ వెంచర్ల ద్వారా ఎయిర్ పోర్టులను నడుపుతోంది. ఈ జేవీల్లో ఈక్విటీ వాటాను కూడా అమ్ముతారు. అయితే ఇందుకోసం విమానయాన మంత్రిత్వ శాఖ తగిన అనుమతులు తీసుకోవాలి. రాబోయే కొన్ని రోజుల్లో  కేబినెట్ ఆమోదం కోసం ఏఏఐ ఇందుకోసం ప్రతిపాదనను పంపే అవకాశం ఉంది. ‘‘ప్రైవేటీకరణ కోసం 13 ఎయిర్ర్పో పోర్టులను లాభనష్టాల ఆధారంగా విడదీస్తారు. లాభాల్లో ఉన్న వాటిని ఒక గ్రూప్ గా, నష్టదాయకమైన వాటిని మరో గ్రూప్ గా కలిపి ఆకర్షణీయమైన ప్యాకేజీలా తయారు చేస్తారు’’ అని అధికార వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. మోడీ ప్రభుత్వం మొదటి రౌండ్ ఎయిర్ర్పో పోల ప్రైవేటైజేషన్ లో భాగంగా అదానీ గ్రూప్ కు లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి ఎయిర్ పోర్టుల కాంట్రాక్టులు ఇచ్చింది. ఏఏఐ దేశవ్యాప్తంగా 100 కి పైగా ఎయిర్ పోర్టులను నిర్వహిస్తున్నది. అదానీ గ్రూప్ కు ముంబై ఎయిర్ పోపోర్టులో 74 శాతం, ఐఐఏకి 26 శాతం వాటాలు ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో జీఎంఆర్ గ్రూప్ 54 శాతం వాటాను కలిగి ఉంది. ఫ్రాపోర్ట్ ఏజీ, ఎరామన్ మలేషియాలకు 10 శాతం వాటాలు ఉన్నాయి. ఏఏఐకు 26 శాతం వాటా ఉంది. ఏఏఐకి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 26 శాతం వాటా ఉంది. కర్ణాటక ప్రభుత్వంతోపాటు ఏఏఐకి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ 26శాతం వాటా ఉంది.  ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్ చేయడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం తప్పనిసరి అని మంత్రి నిర్మల బడ్జెట్ సందర్భంగా అన్నారు. కొత్త ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన ఇన్ఫ్రా అసెట్స్ తో కూడిన "నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్"ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.