ఇవాళ్టి నుంచి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు

ఇవాళ్టి నుంచి ఉప్పల్ మ్యాచ్  టిక్కెట్ల  అమ్మకాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు/సికింద్రాబాద్, వెలుగు:  ఈనెల 25న  నగరంలో జరిగే ఇండియా–ఆస్ట్రేలియా  మూడో టీ20 మ్యాచ్‌‌‌‌ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్‌‌‌‌ రెండు, మూడు రోజులుగా ఉప్పల్‌‌‌‌, జింఖానా గ్రౌండ్‌‌‌‌చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బుధవారం వేల సంఖ్యలో యువకులు జింఖానా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటిదాకా  మొత్తం టిక్కెట్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే అమ్ముతామని హెచ్​సీఏ ప్రకటించింది. కానీ, ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత  గురువారం ఉదయం 10 నుంచి జింఖానా కౌంటర్లలో టిక్కెట్లు అందుబాటులో ఉంచుతామని ప్రెసిడెంట్​ అజరుద్దీన్ పేరిట ఓ ప్రకటన వచ్చింది.

గతంలో ఎప్పుడు మ్యాచ్​ జరిగినా ఆన్​లైన్​తో పాటు కౌంటర్లలోనూ టిక్కెట్లు అమ్మేవాళ్లు. కానీ,ఈసారి హెచ్​సీఏ అందుకు విరుద్ధంగా వ్యవహరించి విమర్శల పాలైంది. ముందుగానే ఆఫ్​లైన్​లో టిక్కెట్లు అందుబాటులో ఉంచితే అభిమానులకు ఇక్కట్లు తప్పేవి. బుధవారం జింఖానాలో ఫ్యాన్స్ శాంతియుతంగానే నిరసన చేపట్టారు. ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న వస్తోంది.

సమస్య ఇంతటితో ముగియలేదు. మ్యాచ్​కు 3 రోజుల సమయమే ఉండటంతో ఫ్యాన్స్​ గురువారం నుంచి జింఖానాకు ఇంకా పోటేత్తే చాన్సుంది. వీరితో  పాటు ఆన్​లైన్​లో కొన్నవాళ్లు  ఫిజికల్​ టిక్కెట్ల కోసం వస్తారు. లైన్​లో నిల్చుని టిక్కెట్లు దొరక్కపోతే ఫ్యాన్స్​ ఎలా రియాక్ట్​ అవుతారో చూడాలి.