అమ్మకానికి ఐకూ నియో 9 ప్రో

అమ్మకానికి ఐకూ నియో 9 ప్రో

న్యూఢిల్లీ: వివో సబ్​–బ్రాండ్​ వివో సరికొత్త స్మార్ట్​ఫోన్​ నియో 9 ప్రో అమ్మకాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్​,   ఐకూ ఈ–-స్టోర్‌‌‌‌ ద్వారా దీనిని ఆర్డర్​ చేయవచ్చు.   ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌‌‌‌లతో కొంటే రూ.రెండు వేల ఇన్​స్టంట్​డిస్కౌంట్​ ఉంటుంది.

రూ. నాలుగు వరకు ఎక్స్‌‌‌‌చేంజ్ బోనస్‌‌‌‌ దక్కించుకోవచ్చు. ఈ ఫోన్​ ధరలు రూ. 32,999 నుంచి మొదలవుతాయి. ఇది ఫియరీ రెడ్,  కాంకరర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  ఇందులో స్నాప్​డ్రాగన్​8 జెన్​2 ప్రాసెసర్​,  ఫ్లాగ్‌‌‌‌షిప్ 50 ఎంపీ సోనీ కెమెరా లెన్స్​వంటి ప్రత్యేకతలు ఉంటాయి.