సబ్బులు, షాంపూల సేల్స్ పెరిగినయ్

సబ్బులు, షాంపూల సేల్స్ పెరిగినయ్

న్యూఢిల్లీ: సబ్బులు, షాంపూలు వంటి ప్రొడక్టుల అమ్మకాలు ఈ ఏడాది జనవరి – మార్చి మధ్య కాలంలో 9.4 శాతం పెరిగాయి. కన్జంప్షన్ పెంచే చర్యలతోపాటు, కొన్ని వస్తువుల రేట్లు పెరగడంతో ఈ గ్రోత్ సాధ్యమైందని డేటా ఎనలిటిక్స్ కంపెనీ నీల్సన్ వెల్లడించింది. రూరల్ మార్కెట్లోనే గ్రోత్ పటిష్టంగా ఉందని, ఈ మార్కెట్ల నుంచి 14.6 శాతం పెరుగుదల వచ్చిందని పేర్కొంది. రెండు క్వార్టర్ల తర్వాత మెట్రో మార్కెట్లలో జనవరి–మార్చి 2021 క్వార్టర్లోనే కొంత మెరుగుదల (పాజిటివ్ గ్రోత్) కనిపిస్తోందని తెలిపింది.  ట్రెడిషినల్ ట్రేడ్ ఛానల్స్ ద్వారా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్) సేల్స్ రెండంకెల గ్రోత్ నమోదవగా, ఈ–కామర్స్ ద్వారా గ్రోత్ సింగిల్ డిజిట్‌‌కే పరిమితమైందని నీల్సన్ రిపోర్టు వెల్లడించింది. రెండో క్వార్టర్‌‌‌‌లో మళ్లీ కొన్ని సమస్యలుండొచ్చని, ఎందుకంటే చాలా చోట్ల మళ్లీ లాక్‌‌డౌన్లు పెడుతున్నారని నీల్సన్ లీడ్ దీప్తాన్శు రే చెప్పారు. ఈ కాలంలో మళ్లీ ఈ–కామర్స్ సేల్స్ పెరగొచ్చని అన్నారు. ఈ ఏడాది కూడా మాన్సూన్ నార్మల్‌‌గా ఉంటుందనే అంచనాలతో, రూరల్ మార్కెట్ బాగా గ్రోత్ సాధిస్తుందని పేర్కొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ సహా రూరల్ స్కీముల కేటాయింపులు పెరగడం కూడా మార్కెట్ గ్రోత్‌‌కు సాయపడుతోందని చెప్పారు. వంట నూనెలు, ప్యాకేజ్డ్ టీ వంటి వాటి రేట్లు పెరగడంతో ఫుడ్ కేటగిరీ పెరిగిందని, కొన్ని పర్సనల్ కేర్ కేటగిరీలలోనూ కన్జంప్షన్ పెరిగిందని నీల్సన్ రిపోర్టు తెలిపింది.