
- పోలీసులకు సల్మాన్ ఖాన్ వెల్లడి
ముంబై: తనను, తన కుటుంబ సభ్యులను హతమార్చేందుకు కాల్పులు జరిపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగేనని బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఆరోపించారు. సల్మాన్ ఇంటిపై కాల్పులకు సంబంధించిన కేసులో ముంబై పోలీసులు 1,735 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. అందులో తనకు, తన కుటుంబానికి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపుల వివరాలను సల్మాన్ వెల్లడించారు.
ఏప్రిల్ 14న తెల్లవారుజామున గెలాక్సీ అపార్ట్మెంట్లోని తన నివాసంలో నిద్రిస్తున్నప్పుడు ఇద్దరు దుండగులు తన ఇంటిపై కాల్పులు జరిపినట్లు తన బాడీగార్డు ద్వారా తెలిసిందని వెల్లడించారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి 2022లో బెదిరింపు లేఖ, 2023లో ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయని సల్మాన్ పేర్కొన్నట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో వెల్లడించారు.