బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అమ్మాయిల శరీరాలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఆయన "ఆప్ కి అదాలత్" అనే టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సల్మాన్ ని "లో నెక్ లైన్ " నిబంధన గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సల్మాన్.. "మహిళల శరీరాలు చాలా విలువైనవి. కాబట్టి వారు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని అన్నారు. మహిళలకు మాత్రమే కాదు, పురుషులు కూడా తమ శరీరాలను బహిరంగ పరచకూడదన్నారు.
అమ్మాయిలు సరే.. ‘ఒ ఓ జానే జానా’ పాటలో మీరు కూడా ఒంటిపై షర్టు లేకుండా కనిపించారు కదా’ అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. ఆ పాటలో నేను స్విమ్మింగ్ ట్రంక్స్‌తో కనిపించాని అని బదులిచ్చాడు సల్మాన్. అయినా అప్పటి పరిస్థితులు వేరని, ప్రస్తుత ఉన్న పరిస్థితులలో మహిళలు తమ శరీరాలు పూర్తిగా కప్పుకునేలా దుస్తులు వేసుకోవాలని. అబ్బాయిలు, అమ్మాయిలను చూడటానికి ఇదే కారణం అవుతుందన్నారు సల్మాన్.
ఇక్కడా ఇంకో విషయం గుర్తుంచుకోవాలని.. అక్కలు, చెల్లెలు, భార్యలు, అమ్మలు కూడా మనం అలా కనిపించడాన్ని ఇష్టపడరని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.