
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కాంబోలో సినిమాపై న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజానికి ఈ కాంబో కోసం సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సోషల్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ సినిమాలు చేయడంలో ఆయన స్పెషలిస్ట్. గజినీ, స్టాలిన్, తుపాకీ, కత్తి, సర్కార్.. ఇలా ఆయన చేసిన ప్రతీ సినిమాలో ఎదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది.
అయితే గత కొన్నిరోజులుగా ఏఆర్ మురుగదాస్ కు సరైన హిట్టు పడటంలేదు. అందుకే.. ఈసారి కొడితే దెబ్బ సాలిడ్ గా ఉండాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకోసం స్టార్ హీరో సల్మాన్ ను ఫిక్స్ చేసుకున్నాడు మురుగదాస్. దాంతో.. ఇప్పటినుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న ఒక న్యూస్ సినిమాపై అంచనాలను ఆమాంతం పెంచేసింది. అదేంటంటే.. ఆడియన్స్ కు, అభిమానులకు రంజాన్ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ లో తన నెక్స్ట్ సినిమా టైటిల్ సికిందర్ అంటూ అనౌన్స్ చేశారు సల్మాన్.
Iss Eid ‘Bade Miyan Chote Miyan’ aur ‘Maidaan’ ko dekho aur agli Eid Sikandar se aa kar milo…. Wish u all Eid Mubarak!#SajidNadiadwala Presents #Sikandar
— Salman Khan (@BeingSalmanKhan) April 11, 2024
Directed by @ARMurugadoss @NGEMovies @WardaNadiadwala #SikandarEid2025 pic.twitter.com/5NIYdjPP9P
ఈ సంవత్సరం రంజాన్ పండుగకు.. బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ సినిమాలు చూడండి. వచ్చే ఏడాది నా సికందర్(Sikinder) మూవీతో కలుద్దాం. అందరికీ ఈద్ ముబారక్.. అంటూ పోస్ట్ పెట్టారు సల్మాన్. అలా తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు సల్మాన్. దాంతో సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సల్మాన్ కటౌట్ కు తగ్గ టైటిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవర్ ఫుల్ కంబోకి పవర్ ఫుల్ టైటిల్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇలా ఈ పండుగకు అనుకోకుండా వచ్చిన అప్డేట్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సల్మాన్ ఫ్యాన్స్. ఇక సల్మాన్, మురుగదాస్ కాబోలో వస్తున్న మూవీ 2025 రంజాన్ కి రిలీజ్ కానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.