లాంగ్ హెయిర్ స్టైల్ తో సరికొత్తగా సల్మాన్

లాంగ్ హెయిర్ స్టైల్ తో సరికొత్తగా సల్మాన్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.  కిసీ కా భాయి, కిసీ కీ జాన్ టైటిల్ తో సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో లాంగ్ హెయిర్ స్టైల్ తో ఆయన సరికొత్తగా కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి మేకర్స్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.  సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు  ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్  కీలకపాత్ర పోషిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు కబీ ఈద్.. కబీ దీవాళీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఆ తరువాత  కిసీ కా భాయి, కిసీ కీ జాన్ అని టైటిల్ మార్చి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తమిళంలో అజిత్ హీరోగా వచ్చి సూపర్ హిట్టైన వీరమ్, తెలుగులో పవన్ నటించిన కాటమరాయుడు చిత్రం ఆధారంగా  కిసీ కా భాయి, కిసీ కీ జాన్ రూపొందుతోంది. ఇందులో సల్మాన్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. వచ్చే ఏడాది జూన్  లో మూవీ రిలీజ్ చేయనున్నారు.