పొలంలో నాటు వేసిన రింకు సింగ్‎కు కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్

 పొలంలో నాటు వేసిన రింకు సింగ్‎కు కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్

లక్నో: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్‎కు కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రింకూతో ప్రేమ, పెళ్లి టాపిక్‎లతో హెడ్ లైన్స్‎లో నిలిచిన ప్రియా సరోజ్.. తాజాగా సింప్లిసిటీ ప్రదర్శించి చర్చనీయాంశంగా మారారు. ఎంపీ అయ్యిండి సాధారణ కూలీలతో కలిసి వరి పొలంలో నాట్లు వేశారు ప్రియా సరోజ్. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసి సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, ప్రియా సరోజ్ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఎంపీ ప్రియా సరోజ్ ఆదివారం (జూలై 20) వారణాసి జిల్లాలో తన పూర్వీకుల గ్రామమైన కరాఖియావ్‎కు వెళ్లింది. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి ఆమె వ్యవసాయ పనులు చేసింది. బురద మడిలో ఉత్సాహంగా వరి నాటు వేసింది. తోటి మహిళా రైతులతో సరదాగా గడిపింది. పొలంలో వరి నాటు వేసిన వీడియోలను ప్రియా సరోజ్ సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇట్టే వైరల్‎గా మారాయి. ఎంపీ ప్రియా సరోజ్ సింప్లిసిటీ, రైతులపై ఆమెకు ఉన్న గౌరవం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. 

►ALSO READ | ALSO READ | Olympic winners: ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్స్‌కు రూ.7 కోట్లు.. గ్రూప్ A ఉద్యోగాలు

టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఉత్తరప్రదేశ్‎లోని ఓ ప్రైవేట్ హోటల్‎లో2025, జూన్ 8న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.  2025, నవంబర్ 18న వీరిద్దరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇక, రింకు సింగ్ వివాహం చేసుకోబోయే ప్రియా సరోజ్ న్యాయవాది, పొలిటిషియన్.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్‎వాదీ పార్టీ నుంచి మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగి ఆమె విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్‌ని 35,850 ఓట్ల తేడాతో ఓడించి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన రెండవ అతి పిన్న వయస్కురాలిగా ప్రియా సరోజ్ చరిత్ర సృష్టించింది. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి బిఎ డిగ్రీతో పాటు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి LLB పట్టా పొందారు.