సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’. బుధవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుందని తెలియజేశారు. విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో సమంత ట్రెడిషనల్ చీరకట్టులో కనిపిస్తూనే, చేతిలో గన్ పట్టుకుని సీరియస్ లుక్‌లో ఉండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
ఒక పక్క గృహిణిగా కనిపిస్తూనే, మరోపక్క శత్రువులను వేటాడే సివంగిలా ఆమె మేకోవర్ ఇంప్రెస్ చేస్తోంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుగా వస్తున్న ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగ్నాథ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ‘
ఓ బేబీ' తర్వాత సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించారు.
