
శాకుంతలమ్, యశోద లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే గ్లామర్ రోల్స్‌లోనూ మెప్పిస్తోంది సమంత. రీసెంట్‌గా ‘కాత్తువాకుల రెండు కాదల్’ చిత్రంతో పలకరించిన ఆమె.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్‌కి జోడీగా కనిపించనుందట సామ్. వీళ్లిద్దరూ ఆల్రెడీ తేరి, మెర్సల్, కత్తి సినిమాల్లో కలిసి నటించారు. నాలుగోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. తను ఇప్పటికే సమంతతో మాట్లాడాడని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. ప్రస్తుతమైతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన అరవై ఆరో చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయింది. నిన్నటి నుంచి చెన్నైలో రెండో షెడ్యూల్‌ని స్టార్ట్ చేశారు. ఇది పూర్తయ్యాక లోకేష్‌తో సినిమా ఉంటుంది. మరోవైపు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది సామ్. త్వరలో తెలుగు బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా వ్యవహరించనుందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇక బుల్లితెరపై కూడా తన ముద్ర వేస్తుందన్నమాటే.