ఖుషి క్లైమాక్స్..సమంత, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్

 ఖుషి క్లైమాక్స్..సమంత, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Deverakonda)- స‌మంత(Samantha) జంట‌గా శివ నిర్వాణ(Shiva Nirvana)  డైరెక్షన్ లో  ' ఖుషీ'  మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఇప్పటికే రిలీజ్ అయినా  'నా రోజా నువ్వే' సాంగ్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. త్వరలో సెకండ్ సింగల్ కూడా రాబోతుంది. తాజాగా ఖుషి మూవీ చివ‌రి షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందనే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు నిజంగా పెళ్లి జరుగుతుందా అని కామెంట్స్ పెడుతున్నారు. 

ఈ వీడియోలో విజయ్ కు జోడిగా కనిపిస్తున్న సమంత చీర కట్టులో ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ భావోద్వేగాన్ని ఇచ్చేలా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab). డైరెక్టర్ శివ నిర్వాణ క‌థ‌ల్లో ఉండే స‌హ‌జ‌త్వం..భావోద్వేగ పూరిత అంశాలు  అందరినీ కనెక్ట్ అయ్యేలా చేస్తాయనే విషయం తెలుస్తోంది.  ద్రాక్ష‌రామ ప‌రిసార‌ల్లో తెరకెక్కిస్తున్న ఈ క్లైమాక్స్ పార్ట్ లో  ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఒక‌టి ఉంటుంద‌ని.. ప్రేక్ష‌కులను కంట క‌న్నీరు పెట్టేంచేలా ఉంటుందని సమాచారం. 

ఇద్ద‌రి ప్రేమికుల మ‌ధ్య ఎడ‌బాటును చెబుతూనే! ఆ స‌న్నివేశం లో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం! ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోనవటం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. శివ నిర్వాణ గత చిత్రాలు నిన్నుకోరి,మజిలీ ఎలాంటి భావోద్వేగాన్ని పంచాయో అంతకు మించిన ఎమోషన్ ఖుషి మూవీలో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 1, 2023న విడుదల కానుంది.