
సెలబ్రిటీలు వేసుకునే కాస్ట్యూమ్స్ కొన్ని అప్పుడప్పుడూ వైరల్‌గా మారుతుంటాయి. వాటి ధర తెలిసి సామాన్య ప్రజలు నోరెళ్లబెడుతుంటారు. ఇప్పుడు సమంత వేసుకున్న ఓ గౌను కూడా నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సామ్ ప్రస్తుతం బాలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తోంది.
అందుకు సంబంధించి రీసెంట్గా కొన్ని ఫొటోలు నెట్టింట షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ గౌనులో చిన్న హెయిర్ కట్లో క్యూట్‌గా కనిపించింది. ఈ డ్రెస్సు ధరను కొందరు ఆన్లైన్లో వెతికి ఆ ఫొటోలు వైరల్ చేస్తున్నారు. దాదాపు రూ.40 వేలు ఖరీదు చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వెకేషన్ తర్వాత సమంత తన మయోసైటిస్ చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె విదేశాలకు వెళ్లనున్నట్టు సమాచారం.