ఆది ‘తీస్ మార్ ఖాన్’ నుంచి  సమయానికే వీడియో సాంగ్

ఆది ‘తీస్ మార్ ఖాన్’ నుంచి  సమయానికే వీడియో సాంగ్

నాటకం ఫేం కళ్యాణ్ జి గోగణ  డైరెక్షన్లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న  సినిమా 'తీస్ మార్ ఖాన్'. ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా..పూర్ణ,  సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌లు, ఫస్ట్ సింగిల్‌తో  ఆకట్టుకున్నాయి.  ఫస్ట్ సింగిల్ పాప ఆగవే అంటూ సాగే ఈపాటలో ఆది, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘సమయానికే’ అంటూ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. సోమవారం వచ్చిన ఈ  మెలోడీ సాంగ్ లో ఆది, పాయల్ రాజ్‌పుత్‌ల జోడి ఆకట్టుకుంది. ఈ పాటలో పాయల్ గ్లామర్ హైలెట్ కాగా.. ఆది షర్ట్ లేకుండా కనిపించారు. ఆది చేసిన వర్కవుట్లు, శరీరాకృతిని మార్చుకునేందుకు పడిన కష్టం ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తుంది. ఈ పాటకు సాయి కార్తీక్ అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను అందించగా..రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు. శృతి ఈ పాటను ఆలపించారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించిన ఈ సినిమా..ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  విజన్ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను  ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.

నటీనటులు 
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ 
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  యాళ్ల తిర్మల్ రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు