ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్కు సుప్రీంకోర్టు ఓకే

ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్కు సుప్రీంకోర్టు ఓకే

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించి 2015లో ప్రవేశపెట్టిన ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)’ విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విధానం రాజ్యాంగ వ్యతిరేకం కాదని, కేంద్ర నిర్ణయం ఏకపక్షం కూడా కాదని స్పష్టంచేసింది. ఓఆర్ఓపీ విధానాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ ఎక్స్ సర్వీస్ మెన్ మూమెంట్(ఐఈఎస్ఎం) సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమన్ నాథ్ తో కూడిన బెంచ్ ఈ తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 2015, నవంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని వెల్లడించింది. పెన్షన్ ను ప్రతి ఐదేండ్లకోసారి రివ్యూ చేసి పెంచాలని చెప్పింది.