
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీర్ వాంఖడే మరదలు హర్షదా దీనానాథ్.. డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకున్నారా అని నవాబ్ మాలిక్ చేసిన ట్వీట్ మీద పోలీసులకు కంప్లయింట్ చేశారు. మంత్రి నవాబ్‌తోపాటు మరో వ్యక్తి నిశాంత్ వర్మపై ఐపీసీ సెక్షన్లు 354, 354 డీ, 503, 506, మహిళల అసభ్య ప్రాతినిథ్య చట్టం 1986లోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని కోరుతూ హర్షదా దీనానాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి ట్వీట్‌ను హర్షదా తన ఫిర్యాదుకు జత చేశారు. డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడేను బెదిరించేందుకే మాలిక్, వర్మలు తనపై ఆరోపణలు చేశారని హర్షదా చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కారణంగా పూణెలో నమోదైన కేసులో తనను ఇరికించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.