గద్దెకు చేరిన సారలమ్మ..తరలివచ్చిన భక్తులు 

గద్దెకు చేరిన సారలమ్మ..తరలివచ్చిన భక్తులు 
  •      భక్తిపారవశ్యంలో జాతర్ల పరిసరాలు
  •      ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రారంభమైన జాతరలు
  •      తరలివచ్చిన భక్తులు 

నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సమక్క– సారలమ్మ జాతరలు ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సారలమ్మ గద్దెకు చేరడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కోయ పూజారులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వనదేవతను గద్దెపై ప్రతిష్టించారు. సారలమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోదావరిఖనిలో జీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని ఆలయంలో మేడారం సమీపంలోని పడిగాపురం గ్రామానికి చెందిన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.

డప్పుల వాయిద్యాలతో పోలీసుల సంరక్షణలో సాయంత్రం 6.30 గంటలకు సారలమ్మను తీసుకుని కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరంలో జాతర స్థలానికి రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. దారి పొడువునా శివసత్తుల పూనకాలు, భక్తులు నృత్యాలు చేయగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాగా అంతకుముందు ఉదయం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్–మనాలి ఠాకూర్​ దంపతులు ప్రత్యేక పూజలు  చేసి జాతరను ప్రారంభించారు. పెద్దపల్లి పరిధిలో దాదాపు 27 జాతరలు ఉండగా, సుల్తానాబాద్​ మండలంలోని గర్రెపల్లి, నీరుకుల్లా

పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, తుర్కల మద్దికుంట, కాల్వ శ్రీరాంపూర్​ మండలంలోని మీర్జంపేట, ఓదెల మండలం కొలనూర్​గ్రామాల్లో సారలమ్మ గద్దెకు చేరడంతో జాతర ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి జాతరలో కోయ పూజారుల ఆధ్వర్యంలో సారలమ్మను చిలుకల గుట్ట నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెకు చేర్చారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరులో సారలమ్మను గద్దె పైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమైంది.  చొప్పదండి మండలకేంద్రంలో జాతర సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.  జమ్మికుంట మండలం కేశవపురం, శంకరపట్నం, ఇల్లందకుంట మండలాల్లోనూ జాతరలు జరిగాయి.