రొమాంటిక్ సాంగ్‌‌లో కిరణ్, నేహా

రొమాంటిక్ సాంగ్‌‌లో కిరణ్, నేహా

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజైంది.  గురువారం రెండో పాటను విడుదల చేశారు. ‘సమ్మోహనుడా.. పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా ఇష్టసఖుడా.. నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌‌లో కిరణ్, నేహా కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.   

అమ్రిష్ గణేష్  ట్యూన్ చేసిన పాటకు.. ‘సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా. మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నవుతా’ అంటూ  రాంబాబు గోసాలతో కలిసి దర్శకుడు రత్నం కృష్ణ క్యాచీ లిరిక్స్ రాశారు. శ్రేయ ఘోషల్ పాడిన తీరుతో పాటు శిరీష్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.  మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్, మకరంద్ దేశ్‌‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, వైవా హర్ష ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌‌ వర్క్ జరుగుతోంది.