
హైదరాబాద్, వెలుగు: శామ్సంగ్ గెలాక్సీ ఏ17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్లో పలు ఏఐ ఫీచర్లు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో ట్రిపుల్కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఐపీ54 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉన్నాయి. గెలాక్సీ ఏ17 ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7తో పని చేస్తుంది.
ఆరు సంవత్సరాల మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను అందిస్తామని శామ్సంగ్ సీనియర్ఎగ్జిక్యూటివ్ఆదిత్య బబ్బర్ చెప్పారు. ధరలు రూ.19 వేల నుంచి రూ.24 వేల వరకు ఉంటాయని, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లు లేదా యూపీఐ చెల్లింపులపై రూ. 1000 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చని వివరించారు.