
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌ను శామ్‌సంగ్ మార్కెట్‌లోకి తెచ్చింది. ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్‌లో వైఫై ఉంటుందని, ఫోన్‌తో ఈజీగా కంట్రోల్ చేయొచ్చని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. దీని కెపాసిటీ 11 కేజీలు. 70 శాతం కరెంట్ ఆదా అవుతుందని, వేగంగా బట్టలు ఉతుకుతుందని కంపెనీ చెబుతోంది. ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్ ధర రూ. 68 వేల నుంచి రూ.72 వేల మధ్య ఉంది.