శామ్సంగ్ విండ్‌ ‌‌‌ఫ్రీ క్యాసెట్ ఏసీలు.. 48 శాతం వరకు కరెంటు ఆదా

శామ్సంగ్ విండ్‌ ‌‌‌ఫ్రీ క్యాసెట్ ఏసీలు.. 48 శాతం వరకు కరెంటు ఆదా

హైదరాబాద్​, వెలుగు: శామ్​సంగ్  స్మార్ట్ విండ్‌‌‌‌ ఫ్రీ క్యాసెట్ ఏసీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి నుంచి వచ్చే గాలి నేరుగా వినియోగదారుల ముఖాలను తాకదు. గది మొత్తం మెల్లగా వ్యాపిస్తుంది. ఈ కొత్త ఏసీలలో  బిల్ట్- ఇన్ వై-ఫై, గాలిని నిశ్శబ్దంగా,  -సమర్థవంతంగా చల్లబరచడానికి శామ్​సంగ్  ప్రత్యేక విండ్‌‌‌‌ఫ్రీ కూలింగ్ టెక్నాలజీ ఉంటాయి. 

ఇవి పర్యావరణ అనుకూలమైన ఆర్​32 రిఫ్రిజిరెంట్‌‌‌‌ను ఉపయోగిస్తాయి. దీనివల్ల 48 శాతం వరకు కరెంటు ఆదా అవుతుంది. ఈ సిరీస్​లో వన్​-వే, ఫోర్​-వే, 360 క్యాసెట్ డిజైన్లు వివిధ కూలింగ్ కెపాసిటీల్లో లభిస్తాయి. వెల్‌‌‌‌కమ్ కూలింగ్ మోడ్, గుడ్ స్లీప్ మోడ్, కంఫర్ట్ హ్యుమిడిటీ కంట్రోల్ వంటి స్మార్ట్‌‌‌‌థింగ్స్ ఫీచర్లను స్మార్ట్‌‌‌‌ఫోన్ ద్వారా కంట్రోల్​ చేయవచ్చు. ధరలు రూ. 65 వేల నుంచి మొదలవుతాయి.