సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటుడు అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘తిరుపతి’గా ఆయన పాత్రను పరిచయం చేశారు.
ఆయన ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ సూచిస్తోంది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గ్యానీ సంగీతం అందిస్తున్నాడు.

