Vimanam Review : "విమానం" ఒక ఎమోషనల్ రైడ్.. డోంట్ మిస్ ది ఎండింగ్

Vimanam Review : "విమానం" ఒక ఎమోషనల్ రైడ్.. డోంట్ మిస్ ది ఎండింగ్

రీసెంట్ టైమ్స్ లో ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా "విమానం" (Vimanam). తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో.. మాస్టర్ ధ్రువన్(Druvan), అనసూయ(Anasuya), రాహుల్ రామకృష్ణ(Rahul ramakrishna) కీ రోల్ పోషించారు. ఈ సినిమా జూన్ 9 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో చూద్దాం. 

కథ: వీరయ్య (సముద్రఖని) ఒక వికలాంగుడు. వారసత్వంగా వచ్చిన సులభ్ కాంప్లెక్స్ ను నడుపుకుంటూ.. కొడుకు రాజు ('మాస్టర్' ధ్రువన్)ను చూసుకుంటాడు. రాజుకు విమానం ఎక్కాలని కోరిక. అతనికి లుకేమియా అనే జబ్బు ఉందని తెలియడంతో ఎలాగైనా విమానం ఎక్కించాలని అనుకుంటాడు వీరయ్య. మరి ఆ తర్వాత ఏమైంది? వీరయ్య జైలుకు ఎందుకు వెళ్ళాడు? వీళ్ళ కథలోకి వేశ్య సుమతి (అనసూయ), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ) ఎలా వచ్చారు? అనేది మిగిలిన కథ. 

రివ్యూ: 'విమానం' సినిమాలో మంచి కథ, కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నాయి కానీ.. ఆ ఎమోషనల్ కథను ఆడియన్స్ కు కనెక్ట్ చేసే కథనం మిస్ అయ్యింది. కథ చిన్నదైనప్పుడు కథనమే బలంగా ఉండాలి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ఎంత బాగా సెట్ అయితే... ప్రేక్షకులు అంత బాగా కనెక్ట్ అవుతారు. దర్శకుడు శివ ప్రసాద్ యానాల అక్కడే తడబడ్డాడు అనిపిస్తుంది. అనసూయ, రాహుల్ రామకృష్ణ సీన్స్ కథలో భాగంగా వచ్చుంటే బాగుండేది. మంచి ఎమోషనల్ కథలో డిస్టబెన్స్ లా అనిపిస్తాయి ఈ సీన్స్. తరువాత ఎం జరుగుతుంది అనేది ముందే చెప్పేయొచ్చు అందువల్ల, కథనం పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. అయితే, ప్రేక్షకుల ఊహికందని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది సినిమా చూసే తెసులుకోవాలి.

నటీనటులు: వీరయ్య  పాత్రలో సముద్రఖని నటించాడు అనే కంటే జీవించాడు అనడం కరెక్ట్. తనదైన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. ఇక మాస్టర్ ధ్రువన్ నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఇక సుమతిగా వేశ్య పాత్రలో అనసూయ శృంగార రసాన్ని పండించింది. క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్ అయితే నెక్స్ట్ లెవల్. ఇక రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, మీరా జాస్మిన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.  

ఇక మొత్తంగా.. విమానం మూవీ ఒక ఎమోషనల్ రైడ్. ఫస్ట్ హాఫ్ సాగదీతగా ఉన్నా.. ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ రోలర్ కోస్టర్ ను తలపిస్తుంది. మరీ ముఖ్యంగా డోంట్ మిస్ ది ఎండింగ్.