మొన్ననే కదా వచ్చింది.. అప్పుడే పడిపోయిందా?

మొన్ననే కదా వచ్చింది.. అప్పుడే పడిపోయిందా?

ట్యాలెంట్​ ప్లస్​ అందం కలగలిసిన నటిగా సంయుక్త మీనన్​ దూసుకుపోతోంది. ఇటీవల విరూపాక్షతో బ్లాక్​బస్టర్​ హిట్టందుకున్న సంయుక్త సౌత్​లో బిజీ హీరోయిన్​గా మారిపోయింది. అయితే, ఇప్పటివరకు ఈ నటికి క్లీన్​ ఇమేజ్​ ఉంది. భీమ్లా నాయక్​ టైంలో త్రివక్రమ్​తో కొన్ని రూమర్స్​ వచ్చినా వాటిని అంతా లైట్ తీసుకున్నారు. 

కానీ, వరుస సక్సెస్​లతో పాటుగా ఇప్పుడు రూమర్స్​ కూడా ఈ బ్యూటీని చుట్టుముడుతున్నాయి. ఇటీవల సంయుక్త ఓ కోలీవుడ్​ హీరోతో స్క్రీన్​ షేర్​ చేసుకున్న విషయం తెలిసిందే. అతడితో ఇప్పుడు ప్రేమలో పడిందని కోలీవుడ్​లో టాక్​​ నడుస్తోంది. ఆ హీరోకి ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు కూడా అయ్యాయట. ఇప్పుడు సంయుక్తతో డేటింగ్​లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఈ హీరోయిన్​ స్పందించాల్సిందే.