V6 News

60 రోజుల్లోనే సంయుక్త ది బ్లాక్ గోల్డ్ షూట్ కంప్లీట్

60 రోజుల్లోనే సంయుక్త ది బ్లాక్ గోల్డ్ షూట్ కంప్లీట్

హీరోయిన్‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తూనే, లీడ్ రోల్‌‌‌‌లో సంయుక్త నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’.  ఈ యాక్షన్‌‌‌‌ డ్రామాకు ‘చింతకాయల రవి’ ఫేమ్ యోగేష్‌‌‌‌ కేఎంసీ దర్శకుడు. మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్.  ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌‌‌‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌లో చిత్రీకరించారు. దాదాపు 60 రోజుల్లో షూటింగ్‌‌‌‌ను కంప్లీట్ చేశారు. ఐదు షెడ్యూల్స్‌‌‌‌లో,  రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను  రిలీజ్ చేశారు.

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌‌‌‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథ మరింత గ్రిప్పింగ్‌‌‌‌గా తీర్చిదిద్దారు. 

ఇందులో సంయుక్త పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ గెటప్‌‌‌‌లో కనిపిస్తుంది.  మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, బీవీఎస్ రవి ఇతర పాత్రలు పోషిస్తున్న  ఈ చిత్రానికి  సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.