
వర్ని,వెలుగు: రుద్రూర్, వర్ని, చందూరు మండలాల్లో ప్రభుత్వ పనుల పేరుతో వే బిల్లులు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు ఇసుక విక్రయిస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం పోతంగల్ మండలం సుంకిని మంజీరా నది నుంచి ఇసుక తరలించేందుకు తహసీల్దార్ వే బిల్లు జారీ చేశారు.
రుద్రూర్ మండల కేంద్రంలో సీసీరోడ్డు నిర్మాణం కోసం ఇసుక తరలించేందుకు రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ కు పర్మిషన్ ఇచ్చారు. కానీ దీన్ని ఆసరా చేసుకున్న సదరు వ్యక్తి మంగళవారం రుద్రూర్ బస్టాండ్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటి ఆవరణలో ఇసుక డంప్ చేసిన దృశ్యం వెలుగు కెమెరాకు చిక్కింది.