
హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సందేహం’. షి బిలీవ్డ్ అనేది ట్యాగ్‌లైన్. ‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ సతీష్ పరమవేద దర్శకుడు. సత్యనారాయణ పర్చా నిర్మిస్తున్నారు. ఇదొక లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నారు మేకర్స్. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా పోస్టర్ డిజైన్ చేశారు. హెబ్బా సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో నేచురల్ లొకేషన్స్, ఇతర ముఖ్య లీడ్ రోల్స్ ని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచారు. ఇందులో హెబ్బా పటేల్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని చెప్పాడు దర్శకుడు సతీష్. సుమన్ వూటుకూరు, శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.