పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ‘సందిగ్ధం’ (SANDIGDHAM). ఇవాళ శుక్రవారం (మే 29, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ మూవీలో నిహాల్, ప్రియా దేశ్‌పాండే, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. ‘తెరచేప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్‌గా నటించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో, ఊహించని ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
దేవ్ (నిహాల్) ఒక సిన్సియర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. అతను మేఘన (ప్రియా దేశ్‌పాండే) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమెపై ఉన్న ప్రేమతో ఒక ఊర్లో పెద్ద హాస్పిటల్ కూడా కట్టిస్తాడు. అంతా హ్యాపీగా సాగిపోతున్న టైమ్‌లో.. దేవ్‌కు అనుకోకుండా సత్య (అర్జున్), కళ్యాణి (కాజల్ తివారి) అనే జంట పరిచయమవుతుంది. మానవత్వంతో ఆ ఊర్లోనే వారికి దేవ్ ఆశ్రయం ఇస్తాడు.
అయితే అక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఊర్లో దేవ్ తప్ప ఆ ఇద్దరినీ ఇంకెవ్వరూ చూడలేరు, వారు ఎవరికీ కనిపించరు. అసలు ఎవరికీ కనిపించని ఆ జంట దేవ్‌కు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? వారి వెనుకున్న మిస్టరీ ఏంటి? ఈ కథలోకి వీర (నవీన్ సంకరపు), కోటయ్యల క్యారెక్టర్లు ఎలా ఎంట్రీ ఇచ్చాయనేదే సినిమా అసలు కథ.
విశ్లేషణ:
దర్శకుడు పార్థసారధి కొమ్మోజు ఎంచుకున్న లూప్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక వ్యక్తికి మాత్రమే కనిపించే పాత్రల చుట్టూ కథను తిప్పడం ద్వారా ఫస్ట్ హాఫ్‌లోనే ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. సినిమా మొదటి సగం పల్లెటూరి వాతావరణంలో లవ్ స్టోరీతో సరదాగా సాగిపోతూనే.. ఇంటర్వెల్ బ్లాక్‌కు వచ్చేసరికి పీక్ థ్రిల్లింగ్ మోడ్‌లోకి మారుతుంది.
సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లు కాస్త రొటీన్‌గా అనిపించినప్పటికీ, కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా క్లైమాక్స్ వరకు అదే టెంపోను మెయింటైన్ చేశాడు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
నటీనటుల పర్ఫార్మెన్స్:
క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా నిహాల్ రఫ్ అండ్ టఫ్ లుక్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపించాడు. హీరోయిన్ ప్రియా దేశ్‌పాండే గ్లామర్ పరంగానూ, యాక్టింగ్ పరంగానూ మేఘన క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేసింది.
మిస్టరీ క్యారెక్టర్లలో నటించిన అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో జీవించేశారు. ఇక విలన్‌గా నవీన్ సంకరపు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాకు మంచి వెయిట్ తెచ్చిపెట్టాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నీకల్ అంశాలు:
పల్లెటూరి స్వచ్ఛతను, మిస్టరీ మూడ్‌ను తన కెమెరాతో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా క్యాప్చర్ చేయగా, నిర్మాణ విలువలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. డైరెక్టర్ పార్థసారధి స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.
ఫైనల్గా..
రొటీన్ సినిమాలకు భిన్నంగా సరికొత్త మిస్టరీ ఎలిమెంట్స్‌తో వచ్చిన పక్కా సైకలాజికల్ థ్రిల్లర్ ఈ ‘సందిగ్ధం’. అక్కడక్కడా కొన్ని సీన్లు కాస్త నెమ్మదించినా.. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడే థ్రిల్లర్ లవర్స్‌కు ఈ వీకెండ్‌లో ఈ సినిమా ఒక క్రేజీ అండ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
