
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. అయితే అభియోగాల నమోదుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ కొంత సమయం ఇవ్వాలని గడువు కోరారు. సండ్ర, ఉదయసింహ అభ్యర్థనపై ఏసీబీ అధికారుల అభ్యంతరం తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని కోర్టును ఏసీబీ కోరింది. ఈనెల 16న అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న నిందితులందరూ హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.