
యాదగిరిగుట్ట, వెలుగు : గుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ. రూ.2.35 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. గత 27 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల్లో నగదుతో పాటు 76 గ్రాముల బంగారం, 9 .475 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా ఉంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హుండీలను సిబ్బంది లెక్కింపు చేయగా.. రూ.2,35,32,627 ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకటరావు తెలిపారు. సుప్రభాతంతో మొదలైన నిత్య పూజలు.. రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. భక్తులు పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల నిర్వహించగా ఆలయానికి రూ.25,82,490 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.