వీరశైవ కులస్తుల సంక్షేమానికి కృషి : పటోళ్ల సంగమేశ్వర్

వీరశైవ కులస్తుల సంక్షేమానికి కృషి : పటోళ్ల సంగమేశ్వర్
  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్ 

ముషీరాబాద్,వెలుగు: వీరశైవ లింగాయత్ లింగ బలిజ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం రాచప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన సంగమేశ్వర్ ను సత్కరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. లింగ బలిజ కులస్తుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి దినేశ్​పాటిల్, నాయకులు చెట్టి శివ, పి.భరత్, సోమేశ్ కుమార్, అశ్విని, శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.