గుట్టుగా సంగమేశ్వరం కడ్తున్నరు

గుట్టుగా సంగమేశ్వరం కడ్తున్నరు
  • దగ్గరలోని గుట్టల నుంచి రోజు వందల టిప్పర్ల మట్టి తరలింపు
  • నాలుగైదు మీటర్ల ఎత్తులో మట్టి పోసి చదును
  • మీడియాను ఆ ఏరియాలోకి రానివ్వని ఏపీ అధికారులు
  •  అన్ని పర్మిషన్లు వచ్చేదాకా పనులు వద్దన్న కేంద్రం
  • అయినా పట్టించుకోకుండా పనులు స్పీడ్ చేసిన ఏపీ
  • ఇంత జరుగుతున్నా స్పందించని సీఎం కేసీఆర్, అధికారులు,

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ సర్కార్​ అత్యంత గుట్టుగా సంగమేశ్వరం లిఫ్ట్​ ప్రాజెక్ట్​ పనులు చేస్తోంది. వాటర్‌‌ రీసోర్సెస్‌‌ అధికారులు, ఇంజనీర్ల పర్యవేక్షణలో దగ్గరలోని గుట్టల నుంచి మట్టిని కృష్ణానదిలోకి తరలిస్తున్నారు. ఎక్స్‌‌కవేటర్లతో గుట్టల నుంచి మట్టి తవ్వుతూ వందల టిప్పర్‌‌లతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా నదిలో నాలుగైదు మీటర్ల ఎత్తులో మట్టి పోసి, చదును చేస్తున్నారు. మట్టి తీస్తున్న గుట్టలతోపాటు సంగమేశ్వరం వైపు ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎవరైనా అటువైపు వస్తే వెనక్కి పంపేస్తున్నారు. మట్టిని తరలించేందుకు ఉపయోగిస్తున్న టిప్పర్‌‌ డ్రైవర్లు, ఎక్స్‌‌కవేటర్​ ఆపరేటర్ల వద్ద ఫోన్లు తీసేసుకుని పనులు చేయిస్తున్నారు. టిప్పర్లు వెళ్లే మట్టిరోడ్డుపైనా నిఘా ఉంచారు. కొత్తవారెవరూ అటువైపు రాకుండా చూస్తున్నారు. మట్టి తరలింపు పూర్తికాగానే అప్రోచ్‌‌ చానల్‌‌, సర్జ్‌‌పూల్‌‌, పంపుహౌస్‌‌, డెలివరీ సిస్టర్న్‌‌ పనులు ఏకకాలంలో చేసేలా ప్లాన్‌‌ చేశారు.

ఢిల్లీలో కేసీఆర్‌‌ చక్కర్లు.. ఏపీలో జగన్‌‌ ప్రాజెక్ట్​ పనులు

ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకుంటామని ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్‌‌  ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు ఎవరు వద్దన్నా కట్టి తీరుతామన్నట్టుగా ఏపీ సీఎం జగన్​ మాత్రం సంగమేశ్వరం పనులు నడిపిస్తున్నారు. పర్మిషన్లు లేకుండా పనులు చేయొద్దని కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలు ఉన్నా ఏపీ సర్కారు లైట్​ తీసుకుంది. ముందుగా మట్టి పనులు వేగంగా పూర్తి చేయాలని.. లిఫ్ట్ లు, పంపు హౌస్​​ నిర్మాణాలకు అనువుగా నీటిని మళ్లించే కట్టలు నిర్మించాలని వర్క్‌‌ ఏజెన్సీని ఏపీ సీఎం ఆదేశించినట్టు తెలిసింది. స్వయంగా సీఎం డైరెక్షన్‌‌ ఉండటంతో.. వర్క్​ ఏజెన్సీ వెంటనే పనులను స్పీడప్​ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు  ఎవరు వద్దన్నా కట్టి తీరుతామన్నట్లుగా ఏపీ సీఎం జగన్​ సంగమేశ్వరం పనులకు డైరెక్షన్​ వహిస్తున్నారు.  పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకుండా పనులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం లైట్​ తీసుకుంది. ముందుగా మట్టి పనులు వేగంగా పూర్తి చేయాలని, లిఫ్ట్ లు, పంప్​ హౌజ్​ నిర్మాణాలకు అనువుగా నీటిని మళ్లించే కట్టలు నిర్మించాలని  వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీని జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించినట్లు తెలిసింది. స్వయంగా సీఎం  డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటంతో వర్క్​ ఏజెన్సీ ఈ  పనులను వేగవంతం చేసినట్లు స్పష్టమవుతోంది.  అపెక్స్​ మీటింగ్​తర్వాత నెల రోజుల నుంచే  ఏపీ ప్రభుత్వం గ్రౌండ్​ వర్క్​ మొదలుపెట్టి  రహస్యంగా పనులు చేస్తుంటే తెలంగాణ ఇరిగేషన్​విభాగం సైలెంట్​గా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఢిల్లీ టూర్​లో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన కేసీఆర్​..ఏపీ కడుతున్న  ప్రాజెక్టుల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలు లేవు.

అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పినా డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపలే..

సంగమేశ్వరం డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర అన్ని డాక్యుమెంట్లను కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీకి, కేంద్ర జలశక్తి శాఖకు పంపి అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలు పెడుతామని ఏపీ సీఎం జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పారు. కానీ ఇంతవరకు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కృష్ణా బోర్డు (కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ) నాలుగు రోజుల క్రితం ఏపీకి లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసింది. ప్రాజెక్టుకు టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రైజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి వీలైనంత త్వరగా డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పించాలని ఆదేశించింది. కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న ఏపీ ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం సంగమేశ్వరం వద్ద పంపుహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను ప్రారంభించింది.

కృష్ణా నదినే మళ్లించేలా..

కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో రాయలసీమకు ఎక్కువ నీటిని తరలించే ప్రాజెక్టులకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం మే 5న జీవో జారీ చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు సంగమేశ్వరం వద్ద రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రాయలసీమ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంకు ఓకే చెప్పింది. శ్రీశైలం నుంచి ఇలా మళ్లించే నీటిని తరలించేందుకు అనువుగా కాలువలు, ఇతర పనులకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. రూ.3,278 కోట్లతో సంగమేశ్వరం పంపుహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర నిర్మాణాల కోసం ఆగస్టులో ఏపీ టెండర్లు పిలిచింది. మేఘా జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పనులు అప్పగించింది.

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ, అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదేశించినా

ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తోందంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ (చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ని ఆశ్రయించడంతో అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29న గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుది తీర్పునిచ్చింది. ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయాలని, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రైజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర అన్ని పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెకవాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన నిర్వహించిన రెండో అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు.